ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ కార్మికులకు బకాయిలన్నీ చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో బ్యాంకుల్లో అప్పుగా తీసుకుంటున్న వెయ్యి కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు గురువారం చెప్పారని గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. 18 డిమాండ్లతో వారు కృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వైవీ రావు, దామోదరరావు మాట్లాడుతూ గతంలో జేఏసీతో సంస్థ చేసుకున్న ఒప్పందాల అమలు తీరుపై చర్చించామన్నారు. పెండింగ్‌లో పెట్టిన అలవెన్స్‌లు ఇవ్వాలని, భార్యాభర్తలకు ఉచిత రవాణా సౌకర్యంపై గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరగా కృష్ణబాబు సానుకూలంగా స్పందించారని వారు వివరించారు.