ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్ వర్గాల కొమ్ము కాస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 18: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ వర్గాలకు మేలుచేకూర్చేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జీత్ కౌర్ ఆరోపించారు. సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. మోదీ ప్రభుత్వం అనుసురిస్తున్న విధానాలతో ప్రభుత్వ రంగ పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా జనవరి 8న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. కార్మిక హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చిందని, వీటిలో వేతన కోడ్ పేరుతో బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ పరిశ్రమలకు చెందిన విలువైన భూములు ప్రైవేటుకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న నేపథ్యంలో విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇదే సమయంలోప్రజల్లో పడిపోతున్న కొనగోలు శక్తిని పెంచేలా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలన్నారు. దేశంలో 7 రైల్వే ఉత్పత్తి యూనిట్లను ప్రైవేటు పరం చేశారని, కోల్, రక్షణ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతులిచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు అనుకూల విధానాలపై ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం అవుతున్నారన్నారు.
దీనిపై గత సెప్టెంబర్‌లో సమ్మెలు, ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో చేపట్టే సమ్మె ద్వారా ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పేందుకు కార్మికు వర్గాలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు బీ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.