ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్ హరిచందన్‌తో ఆచార్య యార్లగడ్డ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఏపీ హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సందర్భంగా తాను రచించిన, అనువదించిన సాహితీ సంపుటాలను బహూకరించారు. తెలుగు సాహిత్య ప్రక్రియలను హిందీ భాషలోకి అనువదించటం ద్వారా ఉత్తర భారతానికి, దక్షిణాదికి మధ్య సాహిత్య వారధిగా పనిచేస్తున్న క్రమాన్ని గవర్నర్‌కు యార్లగడ్డ వివరించారు. నన్నయ్య మొదలు నారాయణరెడ్డి వరకు పలువురు ప్రముఖ కవులు రచించిన కావ్యాలతో రూపొందించిన తాళపత్ర గ్రంథ పేటికను గవర్నర్‌కు యార్లగడ్డ అందజేశారు. గవర్నర్ దాన్ని ఆసక్తిగా పరిశీలించారు. నాటి నుంచి నేటితరం వరకు సాహిత్య సంపదను కాపాడుతూ వస్తున్న కవుల గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఒరిస్సా రాష్ట్రంలోని పలువురు సాహితీవేత్తలను వీరు గుర్తుచేసుకున్నారు. ఆయా ప్రాంతాల భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాలని, అదే క్రమంలో జాతీయతను మరవకూడదని గవర్నర్ హరిచందన్ సూచించారు.