ఆంధ్రప్రదేశ్‌

కల్కిపై నిగ్గు తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, అక్టోబర్ 18: కల్కి ఆధ్యాత్మిక కేంద్రంపై వస్తున్న అవినీతి ఆరోపణలను కల్క్భిగవాన్ అని చెప్పుకునే విజయ్‌కుమార్ నాయుడు బయటకువచ్చి నిజానిజాలు చెప్పాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అటవీ శాఖ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అసలు కల్కి బతికే ఉన్నారా? లేరా ఉంటే ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారన్నారు. ఒక చిన్న ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ఉన్న వ్యక్తి ఇన్ని వేలకోట్లు ఎలా సంపాదించారని, అలాగే ఇన్ని వేల ఎకరాల భూమిని ఏవిధంగా సేకరించారో, వీటన్నింటిపైనా ప్రజల ముందుకువచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కల్కి భగవాన్‌పై ఉందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సత్యవేడు నియోజకవర్గంలో ఇంత భారీస్థాయిలో అవినీతి జరుగుతున్నదని నేషనల్ మీడియా సైతం గత రెండు రోజులుగా కోడై కూస్తున్నా నిజానిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరామన్నారు. ముఖ్యంగా వరదయ్యపాళెం, బీఎన్ కండ్రిగ, సత్యవేడు మండలాలతో పాటు తమిళనాడు, తెలంగాణలలో కూడా వందలాది ఎకరాల భూములు సేవ పేరుతో స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని నడిపే లోకేష్ దాసాజీ, కృష్ణాజీలను అదుపులోకి తీసుకొని విచారించాలని ఆయన కోరారు.