ఆంధ్రప్రదేశ్‌

కాపు విదేశీ విద్యాదీవెన పథకానికి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకంగా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక కాపు కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ప్రభుత్వం కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యాదేవెన పథకం కింద స్కాలర్‌షిప్ మంజూరుకు నిర్వహించిన రెండోరోజు కౌనె్సలింగ్ ప్రక్రియకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ పథకాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1700 కోట్లు ఇచ్చిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఏ పార్టీ వారైనా అర్హత ఉంటే పథకాలు అందిస్తున్నామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పథకాల అమలులో చిత్తశుద్ధి ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం కోటి రూపాయలు మంజూరు చేసింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ కాపులకు సంబంధించి ఒక స్పష్టమైన వైఖరిని గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారన్నారు. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారన్నారు.