ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: రాష్ట్రంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. 2010లో ఏర్పాటు చేసిన కమిషనరేట్‌ను 2017లో రద్దు చేయగా, గతంలో జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ తక్షణమే కమిషనరేట్ అమల్లోకి వచ్చేలా సోమవారం తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తూ, వివిధ రకాల సేవలను అందిస్తోంది.
వౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పరికరాలు, సామర్థ్యం పెంపు వంటి చర్యలు తీసుకున్నా ఆశించిన మేర ఫలితాలు ఉండకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. ప్రాథమిక, మాధ్యమిక దశల్లో ఆరోగ్య సేవల నాణ్యతను గణనీయంగా పెంచేందుకు, వ్యాధులను మరింత సమర్థవంతంగా నియంత్రించేందుకు, వైద్య, ఆరోగ్య సేవల వ్యవస్థల తీరును మరింత మెరుగుపరించేందుకు నిర్ణయించింది. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్, కమిషనరేట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఏపీ వైద్య విధాన పరిషత్, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఆయుష్ కమిషనరేట్, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఏపీ మెడికల్ హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య సేవలు ప్రజల దగ్గరికి చేరుతున్నాయి. వివిధ సంస్థలు, వివిధ కార్యాలయాలుగా ఉండటం వల్ల ప్రజలకు సరైన ఆరోగ్య సేవలు అందడం లేదన్న అభిప్రాయంతో సమర్థవంతమైన ఒక వ్యవస్థ కిందకు వీటిని తీసుకువచ్చేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిపుణుల కమిటినీ నియమించి, దాని సిఫారసు మేరకు కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు 2010 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది.
తరువాత విభాగాల వారీగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఉత్తర్వులను 2017 నవంబర్‌లో రద్దు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2017లో జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ, 2010లో జారీ చేసిన ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వచ్చేలా తాజాగా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ అమల్లోకి వచ్చినట్లయింది.