ఆంధ్రప్రదేశ్‌

రేపు ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్‌కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం నిర్వహించనున్న సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు సంబంధించి ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. కాకినాడ జెఎన్‌టియు క్రీడామైదానంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. తూర్పుగోదావరి జిల్లాను సెంట్‌మెంట్ జిల్లాగా రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. పవన్ కూడా తన ఉద్యమాన్ని ఈ జిల్లా నుండే ప్రారంభించడానికి ముందుకు వచ్చారు. జిల్లా కేంద్రం కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరిట నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తక్షణమే ప్రకటించాల్సిందిగా పవన్ డిమాండ్ చేయనున్నారు.
గత రెండు రోజులుగా జెఎన్‌టియు స్టేడియంలో బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహణ, జన సమీకరణ, సభాస్థలి వద్ద ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు, బారికేడ్లు, ప్రధాన వేదిక, ట్రాఫిక్ క్రమబద్ధీరణకు సంబంధించి చర్యలు చేపట్టారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు ద్వారానే పరిపాలనా సౌలభ్యం సాధ్యమవుతుందన్న భావనతో గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల విభజనకు అనుకూలంగా తీర్మానం చేసింది. కాకినాడ వేదికగా గతంలో ఒక ఓటు- రెండు రాష్ట్రాలు అనే నినాదాన్ని బిజెపి తెరమీదకు తెచ్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు పవన్ కూడా ఇదే అంశంపై బిజెపి నేతలను ప్రశ్నించనున్నారు. అదే కాకినాడలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా ఎలుగెత్తి చాటేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా తూర్పు, పశ్చమ గోదావరి జిల్లాలు కాపు సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతలు ఆత్మగౌరవ సభ విజయవంతానికి వెనుకనుండి పూర్తి మద్దతు అందజేస్తున్నారు. ఈ రెండు జిల్లాల నుండి పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి, కాకినాడ తరలించడానికి ఏర్పాట్లుచేస్తున్నారు.

కాకినాడ జెఎన్‌టియు గ్రౌండ్‌లో నిర్మిస్తున్న వేదిక