తెలంగాణ

జనవరి 2 నుంచి నాటిక పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 3: అప్పాజోస్యుల - విష్ణ్భుట్ల కందాళం ఫౌండేషన్, కోన ప్రభాకర్‌రావు నాటక కళా పరిషత్ సంయుక్త నిర్వహణలో అజోవిభో కందాళం 27వ వార్షికోత్సవాలు వచ్చే ఏడాది జనవరి 2 నుండి 5 వరకు గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించనున్నట్లు శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో అజోవిభో కందాళం వార్షికోత్సవ వివరాలను విలేఖరులకు తెలిపారు. ఈసందర్భంగా ఉప సభాపతి రఘుపతి మాట్లాడుతూ బాపట్లలోని కోన కళాక్షేత్రం (టౌన్ హాలు)లో నిర్వహించే వార్షికోత్సవాల్లో రాష్టస్థ్రాయి సాంఘిక నాటిక పోటీలు, సాహితీ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. వార్షికోత్సవాల సందర్భంగా 2020 సంవత్సరానికి ప్రతిభామూర్తి జీవితకాల సాధనా పురస్కారానికి విహారి (జొన్నలగడ్డ సత్య నారాయణమూర్తి), విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారానికి కే వరలక్ష్మి, సరిలేరు నీకెవ్వరు విశిష్ట నాటక రచనా పురస్కారానికి వల్లూరి శివప్రసాద్‌ను ఎంపిక చేశామన్నారు. మరో ముగ్గురికి రంగస్థల సేవామూర్తి పురస్కారాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పేరొందిన కళాకారులు ప్రతిరోజూ అద్భుతమైన నాటకాలు ప్రదర్శిస్తారన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం తన తండ్రి కోన ప్రభాకరరావు పేరిట ఉన్న నాటక పరిషత్‌తో కలిసి నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. సమాజంలోని అనేక రుగ్మతులను నాటకాల రూపంలో ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చే వీలు కలుగుతుందని రఘుపతి వివరించారు. అజోవిభో కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ అప్పాజోస్యుల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 42 నాటక సంఘాలు తమ ఎంట్రీలు పంపాయని తెలిపారు. వీటిలో అత్యుత్తమమైన తొమ్మిదింటిని తీసుకుని ప్రదర్శిస్తామన్నారు. కార్యక్రమంలో సంస్కృతి వ్యవస్థాపక అధ్యక్షుడు సర్రాజు బాలచందర్, ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు అంబటి మురళి, నాగరాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.