ఆంధ్రప్రదేశ్‌

రేపటి బంద్‌ను జయప్రదం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి అవకాశవాదుల్లా వ్యవహరిస్తూ ప్రజల సంక్షేమాన్ని పణంగా పెడుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 10న రాష్టవ్య్రాప్త బంద్ నిర్వహించనున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని ప్రజాసంఘాల నుండి స్పందన వస్తోందని తెలిపారు. గురువారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శివర్గ సభ్యులు ఎంఏ గఫూర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్ తరాల కోసం నిర్వహిస్తున్న ఈ బంద్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు. కేంద్రం ప్రకటనను స్వాగతించటం ద్వారా చంద్రబాబు అవకాశవాదం తేటతెల్లమైందని ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో ఏమీ లేకపోయినప్పటికీ దాన్ని ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీకి ఇంతవరకు అనుమతులు రాలేదని, నిధులూ ఇవ్వలేదని తెలిపారు. రాజధానికి నిధుల అంశంపై ప్రకటన చేయలేదన్నారు. 15వేల కోట్ల ఆర్థిక లోటును ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పారని, రెండున్నరేళ్ల తరువాత 3070 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఇప్పుడు దాన్ని 10 వేల కోట్లకు కుదించి విడతలవారీగా ఇస్తామంటున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. రైల్వే జోన్, ఉక్కు పరిశ్రమలపై స్పష్టత ఇవ్వలేదని, వాటిని ఆయా మంత్రిత్వి శాఖలకు అప్పగించారని తెలిపారు. పెద్దపెద్ద సంస్థలను పక్కనబెట్టి చిన్నాచితక విద్యా సంస్థలను కేటాయించి అదేదో పెద్ద ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారని, దాన్ని టిడిపి స్వాగతించడం రాష్ట్ర ప్రజానీకాన్ని నమ్మించి మోసం చేయడంతప్ప మరొకటి కాదని ఖండించారు. అన్ని విషయాల్లోనూ బిజెపి నమ్మకద్రోహానికి పాల్పడిందన్నారు. దీనిపై చంద్రబాబుకు నిజాయతీ వుంటే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలోనూ ఏమీలేదని వారన్నారు. ఏదో ఇచ్చేస్తున్నట్లు రెండురోజులు పెద్దఎత్తున హడావుడి చేసి దేనికీ పనికిరాని ప్రకటన చేశారని విమర్శించారు. వెంకయ్యనాయుడుకు నిజంగా మనసుంటే గంట కూడా ఆ పదవిలో ఉండడని, సిగ్గూఎగ్గూ లేకపోవడం వల్లే ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.
వైకాపా కార్యాలయంలో భేటీ
ఇదిలావుండగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలు గురువారం వైకాపా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కె పార్థసారథి అధ్యక్షతన సమావేశమై బంద్‌ను విజయవంతం చేయాలని నిర్ణయించారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పిసిసి కార్యాలయంలో సమావేశమై బంద్ రోజు అన్ని జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని నిర్ణయించారు.