బిజినెస్

జనవరి 1 నుంచి బార్ల సంఖ్య తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 7: మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని బార్ల సంఖ్యను నియంత్రించనున్నారు. వచ్చే జనవరి 1 నుంచి బార్ల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఆదాయార్జన శాఖలపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలను జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలన్నారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మద్యం విక్రయించాలన్నారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు.