ఆంధ్రప్రదేశ్‌

పెన్నానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 25: పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన శుక్రవారం నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. కోవూరు పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న షేక్ ఫయాజుద్దీన్(14), పల్లం వర్షిత్(13), షేక్ లతీఫ్(13) అనిల్ కలిసి శుక్రవారం నెల్లూరులో జరిగే తల్పగిరి రంగనాథుని రథోత్సవం చూసి తర్వాత రంగడి ఆలయం వెనుక తిక్కన పార్కువద్ద ఈతకొట్టడానికి నదిలో దిగారు. ఫయాజుద్దీన్, వర్షిత్, లతీఫ్ నీటిలో దిగగా అనిల్ తనకు ఈతరాదని ఒడ్డున ఉన్నారు. కొద్దిసేపు ఈత కొట్టగా లోతైన ప్రదేశానికి వెళ్లి అక్కడ కాళ్లు అందక నీట మునిగి మృతి చెందారు. ఈ విషయాన్ని గమనించిన గట్టుమీద ఉన్న వారి స్నేహితుడు కేకలు వేసినా అందరూ రథోత్సవం హడావుడిలో ఉన్నందువల్ల ఎవరికీ పట్టించుకోలేదు. రథోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీసు అవుట్‌పోస్టులో విషయాన్ని ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన పెన్నాతీరానికి వచ్చి బాలురను రక్షించే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తూ అప్పటికే వారు ముగ్గురూ మృత్యువాత పడ్డారు.