ఆంధ్రప్రదేశ్‌

భగ్గుమన్న విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పడంతో రాష్ట్రం భగ్గుమంది. అన్ని పట్టణాల్లో విపక్షాల నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు మిన్నంటాయి. అనంతపురం, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, విజయనగరం పట్టణాల్లో విపక్షాల నేతలు , విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. మరో పక్క రైల్వేజోన్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం తేల్చకపోవడంపై విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేయడంతో ఆగ్రహించిన అఖిలపక్షం నేతలు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు 90 మంది అఖిలపక్ష నేతలు అందర్నీ అదుపులోకి తీసుకుని వ్యాన్‌లోకి ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరో పక్క విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించే వరకూ పార్లమెంటు గడప తొక్కేది లేదని అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జోన్ ప్రకటనపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ విశాఖపట్టణం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన దీక్షకు దిగారు. అనంతరం డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించారు. జోన్ ప్రకటనకు సంబంధించి కేంద్రం వైఖరిపై ఆయన మండిపడ్డారు. తొలి నుండి తాను రైల్వే జోన్ అంశంపై స్పష్టమైన వైఖరితో ఉన్నానని పేర్కొన్నారు. అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ఆయన చెప్పారు. నవ్యాంధ్ర ప్రత్యేక హోదా విషయంలో రెండున్నరేళ్లుగా ఊరిస్తూ వచ్చిన కేంద్రం ప్యాకేజీ పేరిట నట్టేట ముంచిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై కేంద్రం తీరుకు నిరసనగా గురువారం నాడు సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు బ్రాడిపేటలోని బిఎస్‌ఎన్‌ఎల్, పోస్ట్ఫాసులను ముట్టిడించారు. కార్యాలయాల లోపలికి చొచ్చుకుని వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. వాపపక్షాలకు వైకాపా నేతలు మద్దతు తెలిపారు. రాష్ట్రప్రజలను మరోమారు కేంద్రం మోసగించిందని ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మాటమార్చడాన్ని నిరసిస్తూ వామపక్షాలు, వైకాపా, విద్యార్ధి సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతల ఆధ్వర్యంలో రాయలసీమలో నిరసనలు మిన్నంటాయి. అనంతపురం, కర్నూలు, కడప , చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం, అరుణ్ జైట్లి, సిఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండుతో ఉభయ గోదావరి జిల్లాల్లో గురువారం ఆందోళనలు మిన్నంటాయి. వైసిపి, వామపక్షాలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఏలూరులో ధర్నా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కాకినాడ, అమలాపురంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు/తిరుపతి,ఒంగోలు, సెప్టెంబర్ 8: ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పిన బిజెపి, టిడిపిలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వామపక్షాల నేతలు అన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తిరుపతిలో బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద వామపక్షాల నేతలు ఆందోళన చేశారు.

చిత్రం.. విశాఖలో అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి దీక్ష