ఆంధ్రప్రదేశ్‌

35 లక్షల మంది రోడ్లపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 12: పేదల కడుపులు కొట్టి మీ కార్యకర్తల కడుపు నింపడం ఏం సంస్కృతి అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలతో గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అరికట్టలేక ఇతరులపై నిందలు మోపడం సరికాదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోక పోవడం ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఒక పక్క వీఓఏ జీతాలను పెంచి, మరో పక్క వారిని ఉద్యోగాల నుండి తొలగించడం ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మ్యాక్స్ చట్టాన్ని తెచ్చామని, ఈ చట్టం వలన డ్వాక్రా సంఘాలు స్వతంత్రంగా పనిచేస్తాయన్నారు. అయితే ప్రభుత్వం ఆయా సంఘాల్లో జోక్యం చేసుకోవడం దారుణమన్నారు. 27 వేల సంఘమిత్రల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, 6,400 మంది పశుసఖిలను రోడ్డుపైకి నెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా సాధికారత కోసం తాము కృషిచేస్తే వైసీపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఇసుక కొరత ఎన్నడూ లేదని, నేడు ఆహారం, విద్యుత్, గ్యాస్, నీటి కొరతలతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. గతంలో ఎరువులు, పురుగుమందులను బ్లాక్ మార్కెట్‌కు తరలించే సంఘటనలు చూశామని, ఇప్పుడు ఇసుకను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ ఐదు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 14వ తేదీ విజయవాడలో 12 గంటల పాటు దీక్ష చేపడుతున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇసుక కొరతపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ పోరాట కమిటీని ఏర్పాటు చేశామని, సభ్యులుగా అచ్చెన్నాయుడు, రామానాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, భూమా అఖిల ప్రియ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బండారు సత్యనారాయణమూర్తిలను నియమించామన్నారు. మొద్దునిద్ర పోతున్న వైసీపీ ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే ఇసుక దీక్షను చేపట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు.