ఆంధ్రప్రదేశ్‌

బాబు డైరెక్షన్ పవన్ యాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ కాదని ఆయనో రబ్బర్‌సింగ్ అని సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎద్దేవా చేశారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పవన్ బుర్రంతా చంద్రబాబుదే అని వ్యాఖ్యానించారు. బాబు స్క్రిప్ట్ చదవడం.. బాబు డైరెక్షన్‌లో యాక్షన్ చేయటం తప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలు పవన్‌కు పట్టవని విమర్శించారు. వెనుకబడిన, కులవృత్తుల వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక భరోసా పవన్‌కు తెలీకపోవటం విడ్డూరమన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలనే కృతనిశ్చయంతో సీఎం ఉన్నారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితం రూ. 12 వందల కోట్లు దోచుకున్న టీడీపీ నేతలతో కలసి లాంగ్‌మార్చ్ చేయడం దౌర్భాగ్యమన్నారు. కార్మికుల కష్టాన్ని దోచుకునే చంద్రబాబు, అచ్చెన్నాయుడును పవన్ ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడితే దాన్ని రాద్ధాంతం చేశారని ఇప్పుడు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాజధాని కోసం వేలాది ఎకరాలు కాజేసిన చంద్రబాబుపై పవన్ ఎందుకు నోరు మెదపరని నిలదీశారు. సీఎం జగన్‌తో పాటు వైసీపీ జెండా మోస్తున్న వారందరికీ టన్నుల కొద్దీ ధైర్యముందనేది పవన్ గ్రహించాలన్నారు. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుపై పవన్ గతంలో అనేక విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు సూక్తిముక్తావళి వల్లించటం ఆయన నైజానికి నిదర్శనమన్నారు. దివంగత నేత వైఎస్ నేర్పిన సంస్కారంతోనే విమర్శలపై అతిగా స్పందించటంలేదని చెప్పారు. విజయసాయిరెడ్డిని మ్యాన్ ఫ్రైడే అని వ్యాఖ్యానించే పవన్ మాన్ విత్ త్రీ ఉమెన్ అని విమర్శించారు. సీఎం జగన్‌ను ఎక్కడికి వస్తావో .. రా అంటూ మాట్లాడే పవన్ వ్యాఖ్యలు తాము పట్టించుకోబోమన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని టీడీపీ ప్రభుత్వం నమ్మించి మోసగిస్తే పవన్ ఎందుకు స్పందించలేదన్నారు. ఆంగ్ల పరిజ్ఞానం లేనందునే తాము ఉద్యోగాల పోటీ పరీక్షలను ఎదుర్కోలేక పోతున్నామని జగన్ పాదయాత్ర సందర్భంగా అనేక మంది నిరుద్యోగులు ప్రస్తావించిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. పవన్ తనయులు చదివే విద్యా సంస్థలో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారని, అలాంటి పవన్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు.