ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర రాజకీయాల్లో ఇక సంచలనాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 16: రాష్ట్ర రాజకీయాల్లో జనవరి తరువాత భారీ మార్పులు చోటుచేసుకుంటాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నట్లుగా సంక్రాంతి తరువాత రాష్ట్రం అనేక సంచలనాలకు కేంద్రమయ్యే అవకాశాలు ఉన్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలన మంచి దూకుడు మీదుందని వారు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతూ అమలు చేస్తున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆర్థిక స్థితిగతులను కాదని తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయడానికే జగన్మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తుండటం చూస్తుంటే రానున్న రోజుల్లో మరింత దూకుడు పెంచుతూ తీసుకునే నిర్ణయాలు దేశంలో సంచలనం సృష్టిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలల్లో దాదాపు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం జగన్ జనవరి 9వ తేదీ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత సంక్రాంతి నాటికి అర్హులైన వారందరికీ ఇంటి స్థలం మంజూరు చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాజకీయ విశే్లషకులు వెల్లడిస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసినట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఆ తరువాత ఉద్యోగుల అవినీతిని అరికట్టడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంపై జగన్ పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తారని వారు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కొత్తవి చేపట్టేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న దృష్ట్యా పాత వాటిలో పెండింగ్ పనులు పూర్తి చేయించడం, గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన పథకం మాత్రమే చేపట్టే వీలుందని వారంటున్నారు. ఈ రెండు వ్యవహారాలు ఆయా శాఖల అధికారులు పర్యవేక్షిస్తుంటారని, దాంతో సీఎంగా తన పని తాను చేసుకోవడానికి అవసరమైన సమయం లభిస్తుందని విశే్లషకులు పేర్కొంటున్నారు. దీంతో ఆయన ఇప్పటికే ప్రకటించిన అవినీతి రహిత పాలనపై దృష్టి సారిస్తారంటున్నారు. ఈ విషయంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటానని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అవినీతిపరులపై ‘అగ్రెసివ్’ (దూకుడు)గా వెళ్తానని జగన్ చెప్పిన విషయాన్ని వారు పేర్కొంటున్నారు. అవినీతిపరులపై ఏసీబీ అధికారుల దాడులు తీవ్రతరం చేసి రాష్ట్ర ఉద్యోగుల్లో భయానక వాతావరణం సృష్టించడం, దాడుల్లో పెద్దఎత్తున అవినీతిపరులను పట్టుకోవడం వంటివి జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తిస్తాయని వెల్లడిస్తున్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి పాలన అంటే జగన్ తరహాలో
ఉండాలని దేశవ్యాప్తంగా ప్రజలు అభినందించే స్థాయిలో ఆయన పని చేస్తారని అంచనా వేస్తున్నారు. ఫలితంగా బీజేపీ నేతలు తన కేసుల విషయంలో కానీ, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం కానీ చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రత్యేక దృష్టి సారించి ప్రజాభిమానం పొందే ప్రయత్నం చేస్తారని విశే్లషకులు వెల్లడిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా ఆయా అధికారులతో ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా అవసరమైతే నిబంధనలు సడలించే అవకాశం ఉందని వారంటున్నారు. మొత్తం మీద పాలనలో కొత్త పుంతలు తొక్కుతూ సంచలనాలు సృష్టించి ప్రజల మన్ననలు పొందుతూ ప్రతిపక్ష పార్టీల్లో భయం సృష్టించడం, దీర్ఘకాలం విజయం సాధించే ప్రణాళికను సిద్ధం చేస్తారని విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు.
*చిత్రం... సీఎం వైఎస్ జగన్