ఆంధ్రప్రదేశ్‌

అర్హులందరినీ నవరత్నాలులో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, నవంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు అర్హులైన వారందరికీ చేరవేయడంలో జిల్లా స్థాయి అధికారుల నుండి గ్రామ వాలంటీర్ల వరకు సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామంలో నవరత్నాలు, వివిధ సంక్షేమ పథకాలు అమలు తీరును ఆమె జిల్లా కలెక్టర్‌తో కలిసి శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా ఏ విధంగా అమలు చేస్తున్నారని ఆమె రైతులకు ప్రశ్నించారు. రైతులు కొలుసు వేణుగోపాల్, ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పథకం కింద తొలుత రూ. 12,500 ప్రకటించినప్పటికీ సీఎం జగన్ ఆ మొత్తాన్ని 13,500కు పెంచి ఇచ్చారని చెప్పారు. ఇటువంటి పథకం కౌలు రైతులకు కూడా వర్తింపచేయడం ఇదే ప్రథమం అన్నారు. ఈ పథకం అర్హులకు చేరిందా అని ప్రశ్నిస్తూ ఇంకా ఎవరైనా మిగిలారా అని రైతులను వాకబు చేశారు. అర్హులైన వారందరికీ భరోసా అందిందని చెప్పారు. తహశీల్దార్ వనజాక్షి మాట్లాడుతూ మండలంలో ఇళ్ళ స్థలాల కోసం 17,608 దరఖాస్తులు అందాయని, వాటిని గ్రామ వాలంటీర్లు పరిశీలన అనంతరం 6,229 మందిని అర్హులుగా గుర్తించామని, మరో 2,707 మంది పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. నివేశన స్థలాల కోసం 184 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, వివిధ సంక్షేమ పథకాల అమలుతీరును ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎస్ సందర్శించారు. గర్భిణులు, బాలింతలకు ఆమె పసుపు కుంకాలు పెట్టారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సీఎస్ వెంట జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత, సబ్ కలెక్టరు ధాన్యచంద్ర, ట్రైనీ కలెక్టర్ అనుపమ, జడ్‌పీ సీఇఓ సూర్యప్రకాష్, డీపీఓ డాక్టర్ అరుణ, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునీత తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సంక్షేమ పథకాల గురించి వివరాలు తెలుసుకుంటున్న సీఎస్ నీలం సాహ్ని