ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేయాలని కాకినాడ లోక్‌సభ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జీరో అవర్‌లో గీత మాట్లాడుతూ పునరావాసం పరిహారానికి నిధులతోపాటు రీయింబర్స్‌మెంట్‌గా ఇవ్వాలని.. నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌రామ్ జీరో అవర్‌లో ఢిల్లీ కాలుష్యంపై ప్రస్తావించారు. చైనాలో మాదిరిగా 10 క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేసేందుకు భారీ ఎయిర్ ఫ్యూరిఫెయిర్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. ఢిల్లీలోని కాలుష్య పరిస్థితి దృష్టిలో పెట్టుకోని ఆయా కార్యాలయాలపై సోలార్ రూఫ్‌లు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రానిక్ వాహనాలకు జీఎస్టీ మినహాయించాలని భరత్ కోరారు. అలాగే వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యుడు జీరో అవర్‌లో మాట్లాడుతూ సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు వల్ల ఏపీ జెన్‌కోకు రూ.2800 కోట్ల ఆర్థిక భారం పడుతోందని, మహానది కోల్ ఫిల్డ్స్ నుంచి బొగ్గు సరఫరాకు సదుపాయం కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద తుపాను వచ్చిన మూడు రోజుల్లో రైతుకు క్లెయిల్ చేసుకోవాల్సి వుందని దాన్ని పది రోజులకు పెంచాలని కేంద్రానికి రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమానికి ప్రధాన మంత్రి తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. కేంద్రం నుంచి అధికారులు సీజన్ ముగిశాక రావడం వల్ల నష్టం అంచనా వేయడం కష్టమని వివరించారు. దీనికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నష్టంపై నివేదిక పంపిన తర్వాతే కేంద్రం నుంచి అధికారులు వస్తారని తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లాలోని గొట్టిప్రోలులో క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీ.శ. 8వ శతాబ్దంనాటి టెర్రకోట బొమ్మలు, ఇనుము, రాగి వస్తువులు, రాళ్లతో చేసిన పరికరాలు, ఇటుక నిర్మాణాలు కేంద్ర పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ సమాధానం ఇచ్చారు. వైసీపీ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014లో విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుందా? అని ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ 2015-20 మధ్య ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసిన రూ.22,113 కోట్లకు గాను 2015-19 ఏళ్లకు రూ.19,613కోట్ల గ్రాంటు ఇవ్వడం జరిగిందని సమాధానమిచ్చారు.