ఆంధ్రప్రదేశ్‌

విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఎపిలో విద్యాహక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో అంగూరి లక్ష్మీ శివకుమారి తదితరులు అడిగిన ప్రశ్నలకు మానవవనరుల మంత్రి తరఫున సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానం చెబుతూ, సర్వశిక్షాఅభియాన్ పథకం కింద వివిధ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా నడుస్తోందని, విద్యార్థులందరికీ ఒకేరకమైన దుస్తులు ఇస్తున్నామని, ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇస్తున్నామని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాఠశాలలను నడిపిస్తున్నామన్నారు. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు వారికి శిక్షణ ఇస్తున్నామని, పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పాఠశాలలకు ప్రహరీగోడలు, టాయిలెట్లు నిర్మిస్తున్నామని పల్లె తెలిపారు.
రాష్ట్రంలో దేవాదాయ భూములను, ప్రభుత్వ భూములను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, భూముల వివరాలను అందించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామన్నారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తకోర్సులు ప్రారంభించే యోచన ఏమీ లేదని పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. గుండుమల తిప్పేస్వామి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, రాష్ట్రంలో 81 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయన్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కాలేజీని యూనివర్సిటీగా మార్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.