ఆంధ్రప్రదేశ్‌

కాలుష్య రహితం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 12: రాజధాని అమరావతిలో ప్రజా రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని పురపాలక మంత్రి, సిఆర్‌డిఎ వైస్‌ఛైర్మన్ నారాయణ చెప్పారు. సోమవారం విజయవాడ సిఆర్‌డిఎ కార్యాలయంలో అమరావతి ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్ మీద జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్లానింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కళాశాలల నిపుణులు పాల్గొన్న ఈ చర్చలో సింగపూర్ ఇచ్చిన రోడ్ నెట్‌వర్క్, మెట్రో రైల్ వ్యవస్థల మీద చర్చించారు. దీంతోపాటు ప్రపంచంలోని బెస్ట్ ప్రాక్టీసెస్ మీద నిపుణులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్ మీద నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని, అయితే కొన్ని చిన్న చిన్న సూచనలు చేసిందని వాటిని కూడా అమలుచేస్తామని అన్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా రాజధానుల్లో ట్రాఫిక్ ప్రధాన సమస్య కాగా, కాలుష్యం రెండవ ప్రధాన సమస్య. వీటిని ఎదుర్కొనేందుకు కావాల్సిన ప్రణాళిక అమరావతిలో తయారుచేయాలని ముఖ్యమంత్రి లక్ష్యమని, ఆ దిశగా చర్చించామని చెప్పారు. 2050కి అమరావతిలో 40 లక్షల జనాభా వుంటుందని, ఈ అంచనాతో ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌కు రూపకల్పన చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మొత్తం రాజధాని నగరాన్ని 9 సిటీలు, 27 టౌన్‌లుగా విభజించి, ప్రతి ప్రాంతాన్ని కలిపేలా ప్రధాన రహదారులు రూపకల్పన చేస్తున్నామన్నారు.