ఆంధ్రప్రదేశ్‌

తుంగభద్రపై కర్నాటక కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 12: రాయలసీమకు ప్రధాన నీటి వనరుగా ఉన్న తుంగభద్ర జలాశయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెలలోనే నీరు గణనీయంగా తగ్గిపోయింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. దీంతో జలాశయంలో నిల్వ ఉన్న నీటిపై కర్నాటక ప్రభుత్వం, రైతులు కనే్నశారు. ఆ నీటిని వాడుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సోమవారం తుంగభద్ర ప్రాజెక్టులో 43.604 టిఎంసిల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఆదే రోజుకి 60 టిఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన మలనాడు, ఆగుంబే, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో వర్షభావం వల్ల ఇన్‌ఫ్లో ఆశించినంత రాలేదు. అంతేగాక ఎగువ భాగాన తుంగ, భద్ర నదులపై దాదాపు 20 టిఎంసిల నీరు నిల్వచేసే ప్రాజెక్టులను కర్నాటక నిర్మించింది. దీనికి తోడు పెద్ద సంఖ్యలో ఎత్తిపోతల పథకాలు నిర్మించడంతో తుంగభద్రకు వచ్చే వరద నీరు క్రమేణ ప్రతి సంవత్సరం తగ్గిపోతోంది. ఈసారి సెప్టెంబర్‌లోనే 43 టిఎంసిలకు పడిపోవడంతో కర్నాటక రైతులు, అధికారుల్లో గుబులు మొదలైంది. ఈసారి సకాలంలో వర్షాలు కురిసి జలాశయంలోకి కనీసం 80 టిఎంసిల నీరు చేరుతుందని భావించిన కర్నాటక రైతులు హొస్పేట, గంగావతి, కంప్లి, కాటకి, సింధరు, శిరుగుప్ప, మాన్విలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. తీరా డ్యాంలో నీరు చేరకపోవడంతో రెండు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుందన్న ఆందోళన కర్నాటక అధికారులు, రైతుల్లో బయలుదేరింది. ఈ నేపధ్యంలో తుంగభద్ర బోర్డు సమావేశం తిరిగి నిర్వహించి ఆంధ్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల వాటా నీటిని పంచుకుందామని కర్నాటక అధికారులు వర్తమానం పంపుతున్నారు. అయితే మన రాష్ట్ర అధికారులు మాత్రం బోర్డు మీటింగ్ ఇప్పుడే వద్దని అంటున్నట్లు సమాచారం. అక్టోబర్ నెలలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ తరువాత బోర్డు మీటింగ్ పెట్టి నీటి పంపకాలు చేసుకుందామని మన అధికారులు అన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో హాలహర్వి, హొళగుంద, కౌతాళం, మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, కోడుమూరు, ఆదోని, కర్నూలు ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్‌లో 40 వేల ఎకరాలకు నీటిని తుంగభద్ర దిగువ కాలువ ద్వారా సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 28 వేల ఎకరాలకు మాత్రమే నీరందిస్తున్నారు. అదే విధంగా హెచ్‌ఎల్‌సి కింద అనంతపురం జిల్లాలో పంటలకు నీరందించాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లా రైతులు మూడు వేల ఎకరాల్లోలో మాత్రమే వరి పంట వేశారు. మిగిలిన ఆయకట్టు భూముల్లో పత్తి, మిరప పంట సాగుచేసినట్లు దిగువ కాలువ ఎస్‌ఇ నేహీమియా తెలిపారు. మనకన్న ఎక్కువశాతం వరి పంట కర్నాటకలో సాగుచేశారు.