ఆంధ్రప్రదేశ్‌

ధ్యానం, జపంతోనే తేజస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 16: ధ్యానం, జపం, స్తోత్రం ద్వారానే మానవుడు తేజోవంతుడవుతాడని ముక్కామల క్షేత్రం యజ్ఞపురదీశ్వరి పీఠాధీశ్వరులు పరమపూజ్య శ్రీ్ధర స్వామీజీ అన్నారు. సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టిఎస్సార్ లలితకళాపీఠం, వెలువోలు ట్రస్టు సంయుక్తంగా శుక్రవారం విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ్ధర స్వామీజీ మాట్లాడుతూ మానవునికి వృద్ధాప్యం తప్పదని, ధ్యానం, జపం వల్ల లభించే తేజస్సు జీవితకాలం ఉంటుందన్నారు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఎంపి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకున్న విశాఖ వాసులకు భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందన్నారు.
ప్రతి యేటా తాను చేసే శివారాధన ఈ ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుందని, దైవ కృపే వారికి తోడని అన్నారు. సినీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ మానవ సేవ, కళారాధన చేసే మంచి మనసు టిఎస్సార్ సొంతమని అన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ, ఎపి యోగాధ్యాన పరిషత్ వైస్ చైర్మన్ పండిట్ శశిభట్టార్ సుదర్శనాచార్య, సినీ నటి మంచు లక్ష్మి, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపి అవంతి శ్రీనివాస్, ఎయు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్ బాల భవన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కె రాము, విజయ్ నిర్మాణ కంపెనీ అధినేత ఎస్ విజయ్‌కుమార్, ఆధ్యాత్మికవేత్త మట్టపల్లి చలమయ్య, ఆగమ విశారద బ్రహ్మశ్రీ కృష్ణ శర్మలను టిఎస్సార్ లలితకళా పరిషత్, వెలువోలు ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

టిఎస్సార్‌ను కాళసర్ప నాగ నివారణ దండంతో ఆశీర్వదిస్తున్న ముక్కామల పీఠాధిపతి శ్రీ్ధర్ స్వామీజీ. చిత్రంలో మంత్రి గంటా ఉన్నారు