ఆంధ్రప్రదేశ్‌

రూ.203 కోట్లతో వ్యక్తిగత మరుగుదొడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు సంబంధించి వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి చేరువగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని నగర పంచాయతీల్లో 38,916 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయగా 33,185 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. మరో 5731 మరుగుదొడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇక రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లలో 45095 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయగా 39092 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. 6003 మరుగుదొడ్ల నిర్మాణం ఆయా మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతోంది. ఇక రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో 83,050 మరుగుదొడ్లను కేటాయించగా, 71,466 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. 11,584 మరుగుదొడ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. గాంధీ జయంతి నాటికి అంటే అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో బహిరంగ ప్రాంతాల్లో మూత్ర విసర్జన చేయకుండా కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
ఆయా నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో మొత్తం లక్షా 67వేల 61 మరుగుదొడ్లను కేటాయించగా, లక్షా 43వేల 743 మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తిచేశారు. 23,318 మరుగుదొడ్ల నిర్మాణం ఆయా ప్రాంతాల్లో జరుగుతోంది. మొత్తం మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.203 కోట్ల 5లక్షలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెబుతున్నట్టుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేన్ ద్వారా రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని యజ్ఞంగా నిర్వహిస్తూ వస్తోంది. బహిరంగ మూత్ర విసర్జన లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా కార్యాచరణతో ప్రభుత్వం ముందడుగేస్తోంది.