ఆంధ్రప్రదేశ్‌

మహాపాదయాత్రలో కదం తొక్కిన మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 25: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, ముఖ్యమంత్రి జగన్ మనస్సును మార్చాలని వేడుకుంటూ రాజధాని ప్రాంత మహిళలు వెంకన్న దర్శనార్థం చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతమైంది. వేలాది మంది మహిళలు, రైతులు, యువత, పిల్లలతో సహా మహా పాదయాత్రలో పాల్గొని కదంతొక్కారు. రాజధాని పరిధిలోని మందడం నుండి అనంతవరం మీసాల వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు పాదయాత్ర సాగింది. 39 రోజుల ఆందోళనలకు భిన్నంగా, వినూత్నంగా శనివారం జరిగిన మహా పాదయాత్ర ప్రభలు, డప్పువాయిద్యాలు, కనకతప్పెట్ల చప్పుళ్లు, జై అమరావతి నినాదాలతో మార్మోగింది. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడం, వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిన నేపథ్యంలో మహిళలు, రైతులు వేలాదిగా పాల్గొని తమ ఆందోళనలను చాటారు. అనంతరం కొండపై వేంచేసియున్న శ్రీనివాసుడిని దర్శించుకుని రాజధానికి, ప్రజల సంక్షేమానికి భూములు ఇచ్చిన తమకు అన్యాయం జరగకుండా చూడాలని, రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా ముఖ్యమంత్రికి మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ వేడుకున్నారు. రాజధాని ప్రాంతాలైన తుళ్లూరు, వెలగపూడి, మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో దీక్షలు, మహాధర్నాలు కొనసాగాయి.
మంగళగిరిలో రాజధాని ఉద్యమానికి సంఘీభావంగా వందలాది మంది మహిళలు మంగళగిరి పానకాల స్వామి ఆలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణాయపాలెంలో నల్లజెండాలు చేతపట్టి రైతులు, మహిళలు మూడు రాజధానులు వద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎర్రబాలెంలో రాజశ్యామల పవిత్ర యజ్ఞం నిర్వహించగా మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఇలా ఉండగా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, జేఏసీసి, ఐకాసా ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొంతమంది దీక్షా శిబిరం ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కల్పించుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడిచేశారు. ఈ సమయంలో ఆలపాటిని కాపాడుకునేందుకు అడ్డుగా టీడీపీ కార్యకర్తలు నిలబడటంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో దీక్షా శిబిరానికి సైతం నిప్పుపెట్టడంతో వెంటనే అప్రమత్తమైన ఐకాసా, జేఏసీ నేతలు, టీడీపీ శ్రేణులు మంటను ఆర్పివేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో టీడీపీ తెనాలి పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్‌కు గాయాలయ్యాయి. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పరిస్థితి చేజారిపోతున్న తరుణంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అనంతరం వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ శ్రేణులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కుమారి సందర్శించి తమ పూర్తి సంఘీభావం తెలియజేయడంతో పాటు దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

''చిత్రాలు.. అనంతవరం వెంకన్న దర్శనానికి తరలివెళుతున్న రాజధాని రైతులు
* తెనాలిలో దగ్ధమవుతున్న జేఏసీ దీక్షా శిబిరం