ఆంధ్రప్రదేశ్‌

‘గోదావరి’ లెక్క తేలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 27: ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని తరలింపువ్యవహారం అధికార విపక్షాల నడుమ చినికి చినికి గాలివానగా మారి శాసన మండలి రద్దు దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా లాభనష్టాలపై రసవత్తర చర్చ జరుగుతోంది. శాసన మండలి అవసరమా అంటూ గురువారం శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగి, సోమవారం మరోసారి అసెంబ్లీలో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఒకవేళ శాసన మండలి రద్దుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపి, అసెంబ్లీ తీర్మానిస్తే గోదావరి జిల్లాల్లో పలువురికి పదవీగడం ఏర్పడుతుంది. శాసన మండలికి సంబంధించి కీలకమైన ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు ఇద్దరూ గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన మహ్మద్ అహ్మద్ షరీఫ్ తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై, శాసన మండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఒకవేళ మండలి రద్దయిన నేపథ్యంలో వీరిరువురూ పదవులు కోల్పోతారు.
అలాగే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా పనిచేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం శాసన మండలి సభ్యుడే. శాసన మండలి రద్దయిన పక్షంలో అయన సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశముంది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఐ వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన వీవీవీ చౌదరి (అబ్బు) శాసన మండలి సభ్యత్వం కోల్పోయే అవకాశముంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు కూడా పదవి కోల్పోయే అవకాశం ఉంది. బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు కూడా మాజీగా మిగిలిపోతారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన పాందువ్వ శ్రీను, కంతేటి సత్యనారాయణ రాజు, రాము సూర్యారావు, అంగర రామ్మోహన్ సైతం సభ్యత్వం కోల్పోయే అవకాశముంది.