ఆంధ్రప్రదేశ్‌

నీరు లేక బీటలు వారిన చేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 18: దేశంలోని ప్రతిఒక్కరు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం కేంద్ర మంత్రి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ ప్రాంగణంలోని సెక్యురిటీ శిక్షణా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓడరేవు ఎండి సిహెచ్ శశిధర్ కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. శిక్షణా కేంద్రం ప్రాంగణంలో భద్రతా సిబ్బంది నుండి మంత్రి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ వరకు మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 2019 సంవత్సరం గాంధీ మహాత్ముని 150వ జయంతి నాటికి స్వచ్ఛ భారతదేశంగా నిలపాలని ప్రధాని మోదీ ఆశయమన్నారు. అందుకు అనుగుణంగా కృష్ణపట్నం పోర్టు వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారంటూ ఆయన ప్రశంసించారు. కృష్ణపట్నం సెక్యురిటీ సర్వీసెస్ శిక్షణా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ బాగున్నాయని ప్రశంసించారు. సివిఆర్ ఇంగ్లీషు మీడియం స్కూల్ విద్యార్థులతో కలిసి వనం-మనం కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు. ఓడరేవు అభివృద్ధి గురించి ఉపాధి, శిక్షణా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఓడరేవు యాజమాన్యం ఖర్చు చేసిన నిధుల వివరాలను పోర్టు సిఇఓ అనిల్‌కుమార్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ నివేదికపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, కంటైనర్ టెర్మినల్ సిఓఓ జితేంద్ర, పిఆర్ హెడ్ వేణుగోపాల్, పోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణపట్నం సెక్యురిటీ సర్వీసెస్ శిక్షణా కేంద్రంలో భద్రతా సిబ్బంది నుండి గౌరవవందనం స్వీకరిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్