ఆంధ్రప్రదేశ్‌

ల్యాండ్ పూలింగ్‌లో టీడీపీ బాటలోనే వైసీపీ: మధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: ల్యాండ్ పూలింగ్ విషయంలో టీడీపీ బాటలోనే వైసీపీ నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విమర్శించారు. విశాఖలో 6116 ఎకరాల పూలింగ్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను, ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. మంగళవారం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మధు మాట్లాడుతూ విశాఖలో పూలింగ్ పద్ధతిలో 6116 ఎకరాల భూమిని తీసుకోవాలనే పేరుతో 25వ తేదీన జీవో నెం 72 జారీ చేసి నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొందన్నారు. సీఆర్‌డీఏను రద్దు చేసే చట్టంలో ఇప్పటి వరకు అక్కడ భూమిలేని పేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ. 2,500 నుండి రూ. 5వేలు పెంచుతున్నామని, పట్టా భూములతో సమానంగా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని పేర్కొన్నారు.