ఆంధ్రప్రదేశ్‌

రూ. 5,250 కోట్ల అంచనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో పేదలకు ఇచ్చేందుకు అవసరమైన నివేశన స్థలాలను కొనుగోలు చేసేందుకు నిధులను సమకూర్చడంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇళ్ల స్థలాల కొనుగోలు, చదును చేసేందుకు దాదాపు 5250 కోట్ల రూపాయల మేర అవసరం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ మేరకు నిధులు సమీకరణపై అర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలోని 25 లక్షల మంది పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించడం తెలిసిందే. వివిధ జిల్లాల్లో పేదలకు పంపిణీ చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 5169 ఎకరాలు అవసరం కాగా, ఇందులో 3813 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో 5089 ఎకరాలు అవసరం కాగా, 2154 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దాదాపు 5967 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమిని సేకరించేందుకు 4888 కోట్ల రూపాయలు, చదును చేసేందుకు యంత్రాలకు రూ.361 కోట్లు
అవసరం అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. భూముల కొనుగోలుకు ఎక్కువ మొత్తం అవసరమైన జిల్లాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లాకు 1950 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాకు 500 కోట్లు, కృష్ణా జిల్లాకు 524 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు. భారీ మొత్తం అవసరం అవుతుండటంతో నిధుల సమస్యను అధిగమించే అంశంపై ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల నుంచి సమకూర్చుకునే పరిస్థితి లేకపోవడంతో బ్యాంక్‌ల నుంచి రుణంగా తీసుకునే అంశం పరిశీలిస్తున్నారు.