ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీ పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రజలను టిడిపి, బిజెపిలు మోసం చేస్తున్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనలో ప్యాకేజీ అనే మాట లేదని, ప్రత్యక్ష పన్నుల కింద రావాల్సిన నిధులన్నీ ప్యాకేజీ పేరిట ప్రకటించారన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటనలో హోదా, ప్యాకేజీ అన్న అంశాలే లేవన్నారు. రాజ్యసభలో హోదా కోసం పోరాడిన కేంద్రమంత్రి వెంకయ్య ప్రస్తుతం తన అభిప్రాయం మార్చుకున్నారా? అని ప్రశ్నించారు. హోదా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.