ఆంధ్రప్రదేశ్‌

అన్ని జిల్లాల్లో బహిరంగ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 18: వెనుకబడి కులాల జాబితాలో చేర్చాలని కోరుతున్న అన్ని వర్గాల, కులాలకు సంబంధించిన వివరాలను బహిరంగంగానే వినతుల ద్వారా స్వీకరించి విచారిస్తామని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ తెలిపారు. బలిజ కాపులను బిసి జాబితాలో చేర్చే అంశంపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ మంజునాథ్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటుచేసిన విషయం పాఠకులకు విదితమే. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న కమిషన్ ఆదివారం సాయంత్రం తిరుపతికి చేరుకుంది. స్థానిక పద్మావతి అతిథిభవనంలో జస్టిస్ మంజునాథ్ కమిటీ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ వర్గాల ప్రజలను వెనుబడిన తరగతుల జాబితాలో చేర్చుట లేదా కేటగిరీని మార్చమని కోరుతూ అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో వాటిని విచారిస్తూ అధ్యయనం చేయడానికి వచ్చామన్నారు. 1994 నుంచి బిసి జాబితాలో స్థానం కల్పించాలని వివిధ వర్గాల ప్రజలు కోరుతున్నారని, బిసి జాబితాలో ఉన్నవారు కేటగిరీలు మార్చాలని వినతులొచ్చాయన్నారు. వీటిని పరిశీలించేందుకే ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అప్పటి నుంచి తాము అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పరిశోధన చేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాలో సర్వే చేపట్టాలని కలెక్టర్ సిద్దార్థజైన్ కోరడంతో ఇక్కడకు వచ్చామన్నారు. ఏ వర్గాల వారైనా తమ అభ్యర్థనలను కమిషన్‌కు సమర్పించుకోవచ్చన్నారు. అయితే సరైన గణాంకాలు సంపూర్ణంగా, స్పష్టంగా ఉండాలన్నారు. అలాగే బిసి జాబితాలో చేర్చవద్దని, కేటగిరీలు మార్చవద్దని మరోవర్గ ప్రజల నుంచి కూడా వినతులు వస్తున్నాయన్నారు. వారి నుంచి కూడా విజ్ఞాపనలు స్వీకరిస్తామన్నారు. ఏ విజ్ఞాపననైనా ఆ కులాలకు సంబంధించిన ఆర్థిక, సాంఘిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని బహిరంగంగానే వీటిపై విచారణ జరుపుతామన్నారు. బాగా వెనుకబడిన వారిని మాత్రమే పరిశీలిస్తామన్నారు. అందులోనూ అత్యధిక ప్రజల పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే 6 మాడ్యూల్స్‌లో వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇందులో విద్య, సాంఘికపరంగా ఎవరు వెనుకబడి ఉన్నారన్న విషయాలపై దృష్టి సారిస్తామన్నారు. వీటిపై అభ్యంతరాలు ఉన్న వారు ఎందుకు బిసిల జాబితాలో చేర్చకూడదో, కేటగిరీ ఎందుకు మార్చకూడదో పూర్తి కారణాలను కూడా తమ విజ్ఞాపనపత్రాలలో తెలియజేయాల్సి ఉంటుందన్నారు.
వారి అభ్యంతరాలను ఎపి బిసి కమిషన్, ప్లాట్ నెంబర్-48, మునిసిపల్ ఎంప్లాయిస్ కాలనీ, విజయవాడ- 520010కు కూడా ప్రతిపాదనలు పంపవచ్చన్నారు. కాగా ఆయా కులాల ఆర్థిక సామాజిక విద్యకు సంబంధించి అన్ని కోణాల్లో, అన్ని జిల్లాల్లో బహిరంగ విచారణ పూర్తిచేసిన అనంతరం ఏ కులాలను బిసి జాబితాలో చేర్చవచ్చో, ఏ కేటగిరీకి మార్చవచ్చో తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, ఆచార్య శ్రీమంతుల సత్యనారాయణ, కార్యదర్శి ఎ కృష్ణమోహన్ పాల్గొన్నారు.