తెలంగాణ

పశుసంపద పెంపునకు పటిష్ట చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో పశుసంపద పెరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అధర్ సిన్హా బుధవారం మంత్రి తలసానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పశుసంపద పెంచేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్నామని, అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. పశుసంపద, మత్స్యసంపద, పాడిపరిశ్రమలపై లక్షలాది కుటుంబాలు ఆధారపడ్డాయని, ఈ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఇప్పటికే చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఈ పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి, పశు, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలు, సూచనలను చేయాలని అధర్‌సిన్హాను కోరారు.