ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్లు, మతోన్మాదులను పెంచిపోషిస్తున్న మోదీ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కార్పొరేట్, నియంతృత్వ, మతోన్మాదులను ప్రభుత్వం పెంచిపోషిస్తోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సిపిఐ ఆధ్వర్యాన గుంటూరులో హోల్‌టైమర్ నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్టస్థ్రాయి వర్క్‌షాపును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ ప్రపంచంలోని పెట్టుబడిదారులు తీవ్ర సంక్షోభంలో ఉంటే భారతదేశంలో జిడిపి 7.2 శాతం అభివృద్ధి సాధించామని చెప్తున్నారని, వృద్ధిని లెక్కించే విధానాల్లో మార్పులుచేసి వృద్ధి చెందినట్లు ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు.
పిటిఐ నిర్వహించిన ఆర్థిక సర్వేలో 10 కుటుంబాలకు చెందిన గుత్త పెట్టుబడిదారులకు 10 లక్షల కోట్లు అదనపు అదాయం లభించేవిధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు. వారిలో అదానీ, అంబానీ, టాటా, బిర్లా, మహీంద్రా, ఐటిసి వంటి సంస్థలకు చెందిన కుటుంబాలున్నాయన్నారు.