ఆంధ్రప్రదేశ్‌

కార్మిక హక్కులను హరిస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 13: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ కార్మిక హక్కులను హరిస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ ధ్వజమెత్తారు. గుంటూరులో మూడు రోజులపాటు జరిగే అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ 5వ జాతీయ మహాసభలు సీపీఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్‌లోని వరికల్లు కోటేశ్వరరావు హాలులో గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత ఫెడరేషన్ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. జాతీయ మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ రోజువారీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో మోదీ సర్కారు వైఫల్యం చెందిందన్నారు. అస్తవ్యస్త పాలన కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం జాతీయస్థాయిలో ఉద్యమం ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయం చేస్తున్నాయని, బ్రిటీష్ తరహాలో విభజించు పాలించు విధానాన్ని అవలంబిస్తున్నాయన్నారు. స్వచ్ఛ్భారత్ ఒక పెద్ద బూటకమని, ఆ పేరుతో మున్సిపల్ కార్మికులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్మికులకు నష్టదాయకమైన కార్మిక చట్టాల క్రోడీకరణకు ఏఐటీయూసీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కార్మికులకు 7వ వేతన సంఘం ప్రకారం సౌకర్యాలను కల్పించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో కేంద్ర కార్మిక సంఘాలకు స్థానం కల్పించక పోవడం శోచనీయమన్నారు. కార్మికుల భద్రతకు కేంద్రం ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సరిగా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో అనారోగ్య కారణంగా వారు మంచాలకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల వేతనాలు, ఆరోగ్య భద్రతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సుకుమార్ దామ్లే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని, అలాంటి వారిపై ఎన్ని పోరాటాలకైనా సిద్ధమని స్పష్టంచేశారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుందని గుర్తుచేశారు. కార్మికులు, కర్షకులు కష్టాల్లో ఉండగా... వారి గురించి పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

*చిత్రం... అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ మహాసభల్లో ప్రసంగిస్తున్న అమర్‌జిత్ కౌర్