రాష్ట్రీయం

దుమ్ముగూడెం వద్ద సిఆర్‌పిఎఫ్ బెటాలియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 19: ఖమ్మం జిల్లాలోని దండకారణ్యం ముఖద్వారం దుమ్ముగూడెం మండలం శివారులో చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఈ బెటాలియన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అనువైన స్థలానే్వషణలో భాగంగా పరిశీలనకు సిఆర్‌పిఎఫ్ ఐజీ సదానంద ధాతే సోమవారం భద్రాచలం మన్యంలో పర్యటించారు. చత్తీస్‌గఢ్ నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో భద్రాచలం చేరుకున్న ఆయన రోడ్డుమార్గం ద్వారా అత్యంత గోప్యంగా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం, ఆర్లగూడెం, గౌరారం ప్రాంతాల్లో పర్యటించారు. స్థలాలను పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఇక్కడ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దండకారణ్యంలో విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే అవకాశం ఉంది. దుమ్ముగూడెం మండలంలోని శివారు గిరిజన గ్రామం పైడిగూడెంలో ఈ క్యాంపును ఏర్పాటు చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. మావోయిస్టుల దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో విరివిగా సిఆర్‌పిఎఫ్ బేస్‌క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగానే ఐజీ సదానంద ధాతే పర్యిటించారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆపరేషన్ గ్రీన్‌హంట్ మూడోదశ ప్రారంభించిన కేంద్ర హోం శాఖ అందులో భాగంగా బేస్‌క్యాంపులు, గగనతలం నుంచి నక్సల్స్‌పై దాడికి వీలుగా చత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్, దంతెవాడ నుంచి మూడు హెలీకాప్టర్లను సిద్ధం చేసింది. వర్షాకాలంలోనూ మావోయిస్టుల అనే్వషణకు వీలుగా ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇవన్నీ సత్ఫలితాలిచ్చాయి. ఈనేపథ్యంలో అబూజ్‌మాఢ్‌కు దారులన్నీ మూసివేసేందుకు దండకారణ్యం సరిహద్దును చక్రబంధంగా మారుస్తున్నారు. సీఆర్‌పీఎఫ్ ఐజీ పర్యటన నేపథ్యంలో వెంకటాపురం, భద్రాచలం పోలీస్ సర్కిళ్లలోని అడవుల్లో భారీగా పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.