ఆంధ్రప్రదేశ్‌

రైతులపై అక్రమ కేసులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 20: గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం, శ్రీకాకుళం జిల్లాలో 426 మంది రైతులు, రైతు కూలీలపై ప్రభుత్వం వివిధ సెక్షన్లపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఖండించారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు 34,281 ఎకరాలను ఇచ్చారన్నారు. అప్పటి ప్రభుత్వంపై నమ్మకం, భరోసాతో 29,881 మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నిర్దేశిత అవసరాలకు మాత్రమే ఆ భూములను వినియోగించాలే తప్ప ఆ ఒప్పందాలను ఉల్లంఘించి ఇళ్ల స్థలాలకు ఆ భూములు ఇస్తామనడం సరికాదన్నారు. రాజధాని రైతులు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా 65 రోజులుగా రైతులు, మహిళలు, రైతు కూలీలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం భూములను ఇళ్లపట్టాలుగా ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని చంద్రబాబు ఖండించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనన్నారు. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలే తప్ప పట్టాల నెపంతో రైతులపై దౌర్జన్యాలు చేయడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు నిదర్శనమన్నారు. భూ సేకరణ ద్వారానే గతంలో ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇచ్చాయని, చెరువు భూములు పూడ్చి, అసైన్డ్ భూములు లాక్కుని పట్టాలు ఇవ్వాలని చూడటాన్ని ఇప్పుడే మొదటి సారి చూస్తున్నామన్నారు.