ఆంధ్రప్రదేశ్‌

దాచేపల్లిపై వరాల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి, సెప్టెంబర్ 25: దాచేపల్లిలో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వెంటవెంటనే వరద నష్టం సంభవిస్తోందని తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి తక్షణం 10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వరద ప్రాంతాల్లో బాధితులను పరామర్శించిన అనంతరం దాచేపల్లి మార్కెట్‌యార్డులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు కాంట్రాక్టర్ల మూలంగా దాచేపల్లి నష్టపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వరద బాధితులకు తక్షణ సహాయం రేపు సాయంత్రంలోగా అందజేస్తామని చెప్పారు. మిరప నారు 50 శాతం సబ్సిడీపై ఇస్తామని, పప్పు ధాన్యాల సాగుకు రైతులు ముందుకొస్తే 80 శాతం సబ్సిడీ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వరద వలన పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 95 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 5200 నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అదే విధంగా వంట సామాగ్రి కొనుగోలుకు 3500 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమమహేశ్వరరావు, రావెల కిషోర్ బాబు, శిద్దా రాఘవవు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

సుడిగాలి పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లిలో సుడిగాలి పర్యటన చేశారు. వరద కారణంగా నష్టపోయిన దాచేపల్లి మెయిన్ బజార్‌లోని షాపు షాపు వద్దకు వెళ్లి భాదితులతో మాట్లాడారు. తొలుత హెలికాప్టర్ ద్వారా పంట నష్టాన్ని ఏరియల్ సర్వే చేసిన సిఎం నడికూడి మార్కెట్ యార్డుకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో దాచేపల్లి చేరుకుని వరద వలన దెబ్బతిన్న నాగులేరు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ దాచేపల్లిలో హైవే విస్తరణ పనులు చేపట్టిన రాంకీ సంస్థ ఒక పద్ధతి లేకుండా హైవే విస్తరించడం, దానికి తోడు నాగులేరుపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయవలసి ఉండగా, దానికి భిన్నంగా పియుటి బ్రిడ్జి నిర్మించడం వలన వరద నీరు గ్రామంలోకి ప్రవేశించి తీవ్ర నష్టం వాటిల్లిందని సిఎంకు వివరించారు. ఈ ఏడాది ఇప్పటికి మూడుసార్లు వరదలు రాగా వచ్చిన ప్రతిసారి తమ దుకాణాల్లోకి వరద వస్తోందని వ్యాపారులు సిఎం దృష్టికి తెచ్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము కోలుకోవడం కష్టమని సిఎంకు వారు వివరించారు. అనంతరం సిఎం నాగులేరు బ్రిడ్జి పరిసర ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. దాచేపల్లి కాట్రవాగు వరద నీరు ఇళ్ళలోకి ప్రవేశించడంతో నష్టపోయిన కుటుంబాలను సిఎం పరామర్శించారు. వరద కారణంగా జరిగిన నష్టాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి తెలిపారు.

చిత్రం..దాచేపల్లి ప్రాంతంలో వరదకు గురైన పంట పొలాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తున్న సిఎం చంద్రబాబు.