ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 27: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొద్ది రోజులుగా ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ప్రభావం ప్రస్తుతం తగ్గినట్టే తగ్గుతూ మళ్లీ పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మంగళవారం రాత్రి పులిచింతల గేట్లను తెరచి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ నీరు బ్యారేజీకి చేరనుంది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రికి పులిచింతల దిగువ నుంచి 30 వేల క్యూసెక్కులు, కీసర నుంచి 16 వేల 500 క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి చేరుతోంది. పట్టిసీమ మోటార్లు కట్టివేయటంతో చుక్క నీరు కూడా దిగువకు రావటం లేదు.