రాష్ట్రీయం

డిస్కంలను లాభాలబాటలో నడిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసిన డిస్కంలను లాభాల బాటలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ వాణిజ్య సరఫరా వ్యవస్థలో నష్టాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రణాళిక ఖరారు చేశామన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో డిస్కంలు లాభాల్లోకి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ స్కీం ప్రయోజనాలను ఏపి పూర్తిగా వినియోగించుకుంటోందన్నారు. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీ కింద ఈ ఏడాది రూ. 3200 కోట్లను డిస్కంలకు చెల్లిస్తున్నట్లు చెప్పారు.
వ్యవసాయేతర మీటర్డ్ సేల్స్, వాణిజ్య, సాంకేతిక పంపిణీ నష్టాలపై దృష్టిని సారించామన్నారు. 11కెవి లోపల విద్యుత్‌ను వినిమయం చేసే పరిశ్రమల సంస్ధల అధినేతలు విద్యుత్ సేఫ్టీ చర్యలు తీసుకుంటామని స్వీయ ధృవపత్రం ఇస్తే విద్యుత్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఈ ఏడాది ఇంతవరకు శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా రికార్డు స్థాయిలో 17 ఎంయు విద్యుత్‌ను ఉత్పత్తి చేశామన్నారు.