రాష్ట్రీయం

తెలుగు భాషకు మరింత ఔన్నత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: సాహిత్య అకాడమీ, సంగీత, నాటక అకాడమీ, లలితకళా అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాల తరహా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయటం ద్వారా తెలుగు భాష, సంస్కృతి, సాంస్కృతిక ఔన్నత్యానికి, అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలుగు భాష అధ్యయన సంఘం తెలిపింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు విధాన మండలి ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సంచాలకుడు విజయభాస్కర్‌లతో కూడిన తెలుగు భాష అధ్యయన సంఘం శుక్రవారం ఢిల్లీలో ఈ విషయం తెలిపింది. తెలుగు భాష ఔన్నత్యం పెంచేందుకు తీసుకోవలసిన చర్యల గురించి అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ ఢిల్లీకి వచ్చింది. కమిటీ సభ్యులు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారీ, కార్యదర్శి కె.శ్రీనివాస్‌రావుతో భేటీ అయి సాహిత్య అకాడమీ నిర్వహణ, పని తీరు, వ్యవస్థాగత నిర్మాణం, నిధుల సమీకరణ, వివిధ భాషలలోని సాహిత్యాన్ని తెచ్చేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. రాఘునాథ రెడ్డి బృందం ఆ తరువాత జాతీయ సంగీత నాటక అకాడమీ కార్యదర్శి రీటాస్వామి చౌదరిని కలిసి దేశంలోని వివిధ రకాల కళలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్థలను ఏర్పాటు చేస్తామని రఘునాథ్ రెడ్డి చెప్పారు.