ఆంధ్రప్రదేశ్‌

ఈసారి పసిడి పతకం తెస్తా : సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, అక్టోబర్ 2: వచ్చే ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి దేశ కీర్తిప్రతిష్ఠలను ఉన్నతస్థాయికి తీసుకెళతానని రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ రజత పతక విజేత పివి సింధు అన్నారు. ఆదివారం సింధు కోచ్ గోపీచంద్‌తో కలిసి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టును సందర్శించారు. అనంతరం సెక్యురిటీ నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. టాప్‌లేని జీప్‌పై కోచ్ గోపీచంద్‌తోపాటు పోర్టు ఎండి శశిధర్, సిఇఓ అనిల్‌కుమార్‌తో కలిసి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా పోలీసు డాగ్ పివి సింధుకు పూలబుట్టను అందజేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఇఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ సింధు విజయం వెనుక కోచ్ గోపీచంద్ క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఉందన్నారు. విజయాన్ని అందించడంలో కోచ్ గోపీచంద్ ద్రోణాచార్యుడిని మించిపోయారని అభినందించారు. సింధు వయసులో చాలా చిన్నది అయినప్పటికీ దేశ ప్రతిష్ఠను పెంచటంలో ఆమె పడుతున్న శ్రమ హర్షణీయమంటూ ప్రశంసించారు. జిల్లాలో కూడా కోచ్ గోపీచంద్ అకాడమీని ప్రారంభించాలని, అందుకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు ఓడరేవు సిద్ధంగా ఉందన్నారు. అనంతరం కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ సింధు విజయం వెనుక 12 సంవత్సరాల నిరంతర కృషి ఉందన్నారు. ఈసారి జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో సింధు బంగారు పతకాన్ని సాధించడంలో సందేహం లేదన్నారు. జిల్లాలో బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ అకాడమీలో కూడా ఓడరేవు అందించిన సహాయం మరువలేనిదని అన్నారు. అనంతరం సింధు మాట్లాడుతూ తన విజయం వెనుక కోచ్ గోపీచంద్ క్రమశిక్షణతో కూడిన శిక్షణతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. అభిమానుల దీవెనలు ఎల్లప్పుడు తమపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అంతకుముందు ఎండి శశిధర్ చేతులమీదుగా సింధుకు సిల్వర్ బ్యాట్‌ను బహూకరించారు. బంగారు పతకం సాధించేంత వరకు టైమ్ మరిచిపోని విధంగా కోచ్ గోపీచంద్‌కు వాచ్‌ను అందజేశారు. సింధు తల్లికి వెండి పూజాసామగ్రిని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఓడరేవు పిఆర్ హెడ్ వేణుగోపాల్, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు, కోచ్ గోపీచంద్‌లకు ఘనంగా స్వాగతం పలుకుతున్న దృశ్యం