ఆంధ్రప్రదేశ్‌

గల్ఫ్ మోసాలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 4: ఏపిలో పలు జిల్లాలకు చెందిన మహిళలు, యువకులను ప్రలోభపెట్టి గల్ఫ్ దేశాలకు తరలించి, వారి శ్రమను దోపిడీ చేస్తున్న నకిలీ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర సమాచార, ఐటి, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి డా. పల్లె రఘునాథరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. గల్ఫ్ మోసాలపై ఇటీవల పలు దినపత్రికల్లో వస్తున్న కథనాలపై మంత్రి స్పందించారు. గల్ఫ్ దేశాల్లో పని మనుషులుగా నరకయాతన అనుభవిస్తున్న వారి వివరాలను సేకరించాలని మంత్రి పల్లె పోలీసు, రెవెన్యూ విభాగాలకు ఆదేశించారు. మండలాల వారీగా గల్ఫ్ వెళ్లినవారి జాబితాతో పాటు బాధితుల జాబితాను నెలలోపు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. గల్ఫ్‌లో చిక్కుకుని యజమానుల మోసాలకు, వేధింపులకు గురవుతున్న వారిని వెంటనే వారి స్వగ్రామాలకు చేర్చాలని ఇప్పటికే కేంద్ర విదేశాగ శాఖ మంత్రి కార్యాలయాలతో పాటు గల్ఫ్ రాయబార కార్యాలయాలకు లేఖలు రాసినట్టు మంత్రి పల్లె వెల్లడించారు. నకిలీ ఏజెంట్ల మోసాలను అరికట్టి, వారి ఆగడాలను అడ్డుకోవడంలో అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ఉభయగోదావరి జిల్లాల ఎస్పీలు తీసుకున్న చర్యలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే ఎస్పీ 120 గ్రామాలను సర్వే చేయగా 114 మంది గల్ఫ్‌కు వెళ్లినట్టు తేలిందని, జిల్లాలో ఇప్పటికే పెద్దఎత్తున నకిలీ ఏజెంట్లను అరెస్ట్ చేయడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన జిల్లాల అధికారులు కూడా మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి పల్లె ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ విభాగం సేవలను జిల్లా స్థాయికి విస్తరించాలని, అందులో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ విభాగం ఏర్పాటుచేసి, విదేశాలకు వెళ్లేవారి పేర్ల నమోదుతోపాటు వీసా చెకింగ్, ఇమ్మిగ్రేషన్ చట్టాలు, నిబంధనలపై అవగాహన కల్పించాలని మంత్రి పల్లె ఆదేశించారు.
నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తం
కాకినాడ: గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్ళే వారు భద్రతా కారణాల దృష్ట్యా ఇకనుండి తమ వివరాలను తప్పనిసరిగా సంబంధిత రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో తమ వివరాలను నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వర్కర్లు గల్ఫ్ దేశాలకు వెళ్ళాలంటే పాస్‌పోర్ట్, వీసాలు కలిగివుంటే చాలు విమానం ఎక్కేసేవారు. ఇకపై ఆయా జిల్లాల్లోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో తమ వివరాలను ఇచ్చిన తరువాత గాని గల్ఫ్ దేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుండి ఏటా వేల సంఖ్యలో వర్కర్లు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.
ఈ జిల్లాలోని ఒక్క రాజోలు ప్రాంతంలో 5 శాతం ప్రజలు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్తున్నట్టు అధికారుల అంచనా. పలువురు వర్క్ పర్మిట్లు లేకుండా వెళ్ళడం వలన ఆయా దేశాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అధికారులు గుర్తించారు. గల్ఫ్‌లో ఉపాధి నిమిత్తం వెళ్తున్నవారిలో అధిక సంఖ్యలో మహిళలు కూడా ఉంటున్నారు. పెద్దగా చదువు లేని మహిళలు విదేశాల్లో ధనికుల నివాసాల్లో ఆయాలు, పని మనుషులుగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్ళిన వర్కర్లు, వారి బంధువుల నుండి ప్రభుత్వ యంత్రాంగానికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు.