ఆంధ్రప్రదేశ్‌

సమాంతర కాలువలతో సాగు భూమి వృథా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 4: ఉభయ గోదావరి జిల్లాల్లో వివిధ సాగునీటి ప్రాజెక్టుల కారణంగా ఎప్పటికి ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తారో ఇంకా స్పష్టం కానప్పటికీ, మూడు ప్రాజెక్టుల కారణంగా ప్రస్తుతం సుమారు పది వేల ఎకరాల భూమి మాత్రం నిష్ఫలంగా మారింది. పోలవరం, పుష్కర ఎత్తిపోతల, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కాలువలు సమాంతరంగా వెళ్లడంతో ఈ కాలువల మధ్య ప్రభుత్వం సేకరించిన భూమి నిరుపయోగంగా బీడుపడింది. వివరాల్లోకి వెళితే భారీ బహుళార్ధ సాథక పోలవరం ప్రాజెక్టు ద్వారా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం కాలువల వ్యవస్థను రూపొందిస్తున్నారు. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో పుష్కర, పశ్చిమలో తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మరో సుమారు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు కోసం కాలువలు ఏర్పాటుచేస్తున్నారు. దాదాపు ఈ మూడు పథకాల ద్వారా సుమారు 10 లక్షల ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది. అయితే ఈ కాలువల నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో వేలాది ఎకరాలు వృథాగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ, తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ సమాంతరంగా ఏర్పాటుచేశారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం ఎడమ కాలువ, పుష్కర ఎత్తిపోతల పథకం కాలువ సమాంతరంగా ఏర్పాటుచేశారు. ఇలా రెండు కాలువలు సమాంతరంగా ప్రయాణించడంవల్ల ఈ కాలువల గట్ల నడుమ వేలాది ఎకరాల సారవంతమైన భూములు వృథాగా మారాయి. తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ కోసం 15,653.52 ఎకరాల భూములు అవసరం కాగా ఇంత వరకు 13,751.17 ఎకరాలు సేకరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కుడి ప్రధాన కాల్వ కోసం మొత్తం 15,025 ఎకరాల భూమి అవసరం కాగా 15025.84 ఎకరాలు సేకరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని పుష్కర ఎత్తిపోతల పథకం కోసం 6,260.26 ఎకరాల భూమి అవసరం కాగా ఇంత వరకు 6,207.89 ఎకరాలు సేకరించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం కోసం 5,192.66 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 4,721.57 ఎకరాలు సేకరించారు. సేకరించిన ఈ మొత్తం భూమిలో దాదాపు పది వేల ఎకరాల వరకు నిరుపయోగంగా మారినట్టు తెలుస్తోంది. భారీ వెడల్పుతో నిర్మించిన పోలవరం కాల్వకు, ఇటు తూర్పులో అయితే పుష్కర, పశ్చిమలో అయితే తాడిపూడి కాల్వల మధ్య వేల ఎకరాలు గట్ల రూపంలో దిబ్బలుగా మారాయి. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో గండేపల్లి, రంగంపేట, రాజానగరం, కోరుకొండ, గోకవరం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో కాల్వ తవ్వకంలో వచ్చిన మట్టిని గట్లపై ఎత్తుగా పోశారు. వాస్తవానికి రెండు గట్ల మధ్య రోడ్లు ఏర్పాటుచేసి గ్రామాలను అనుసంధానించాల్సివుంది. ఇటు పోలవరం, అటు పుష్కర, తాడిపూడి కాల్వల మధ్య ఒక్కోచోట దాదాపు రెండేసి ఎకరాల వెడల్పున భూములు వృథాగా మారిపోయాయి. కొన్నిచోట్ల ఎతె్తైన దిబ్బలుగా మారిపోతే, మరి కొన్ని చోట్ల ప్రమాదకరమైన గోతులుగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మట్టి దిబ్బలను మాఫియా తరలించి సొమ్ము చేసుకుంది. రెండు కాల్వల పరిధిలో సేకరించిన భూములపై జల వనరుల శాఖదే పూర్తి ఆధిపత్యం. అవసరం కంటే అదనంగా భూమిని సేకరించడం, రెండు కాల్వలు సమాంతరంగా తవ్వడంవల్ల ఈ రెండు కాల్వల మధ్యలోవున్న భూములు ఎటూ చెందకుండా నిరుపయోగంగా మారిపోయాయి. గట్ల వెంబడి కనీసం కొబ్బరి చెట్లు పెంపకం చేపడితే జల వనరుల శాఖకు ఆదాయమైనా సమకూరుతుందని, వృథా అయిన ఈ కోట్ల విలువైన భూములను గట్ల రూపేణా సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సివుంది.