ఆంధ్రప్రదేశ్‌

ఈ భోజనం మేం తినలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, అక్టోబర్ 4: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్స్ మెస్‌లో విద్యార్థులకు నాసిరకం ఆహారపదార్థాలు పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు. వర్సిటీ హాస్టల్స్‌లోని అన్ని మెస్‌లకు తాళాలు వేసి విద్యార్థులు హాస్టల్స్ వద్ద బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వర్సిటీ మెస్‌ల్లో విద్యార్థులకు నాసిరకం ఆహార పదార్థాలను అందిస్తున్నారని, ఎన్నిసార్లు అధికార్ల దృష్టికి తీసుకువెళ్లినా వారు సరైన రీతిలో స్పందించటం లేదని వారు ఆరోపించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయకుండా మెస్‌లకు తాళాలు వేసి విద్యార్థులు నిరసనకు దిగటంతో ఆందోళన చేస్తున్న కొంతమంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. సొమ్మసిల్లిన వారిని వర్సిటీ అంబులెన్స్‌లో హూటాహూటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వర్సిటీ కళాశాల ఉన్నతాధికార్లు పలు దఫాలుగా విద్యార్థులను శాంతింపచేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వర్సిటీ వీసీ వచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని విద్యార్థులు భీష్మించడంతో అధికార్లు వెనుదిరిగారు. అనంతరం విద్యార్థులు, విద్యార్థి సంఘనేతలు వర్సిటీ ప్రధానద్వారం వద్ద బైఠాయించి, ధర్నా నిర్వహించారు. వర్సిటీ వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ విద్యార్థుల వద్దకు చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వీసీతో మాట్లాడుతూ మెస్‌లో విద్యార్థులకు అందించే ఆహారం నాసిరకంగా ఉంటోందని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. హాస్టల్స్ అంతా చెత్తా, చెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉన్నా అధికార్లు ఎవరూ పట్టించుకోవటం లేదని తెలిపారు. విద్యార్థులు తెలియచేసిన సమస్యలను సావధానంగా విన్న వీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో వర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాల నాయకులు, పరిశోధకులు పాల్గొన్నారు.
వర్సిటీలో అక్రమాలపై విచారణ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆక్రమాలు జరిగాయని పత్రికలలో వచ్చిన అంశాలపై ప్రభుత్వం నియమించిన నూతన విచారణ కమిటీ మంగళవారం వర్సిటీకి చేరుకుని విచారణ ప్రారంభించింది. అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లను, రికార్డులను అధికార్లు తనిఖీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వివిధ విభాగాలలో చేపట్టిన నియామకాలు, వీసీ అనుమతి లేకుండా జరిగిన ఆర్థిక లావాదేవీలలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం గతంలో ఉదయలక్ష్మి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కన్నమదాస్ పదవీ విరమణ చేయటంతో, ప్రభుత్వం కొత్తగా ఐఎఎస్ చక్రపాణి నేతృత్వంలో మరొక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, ఉన్నతవిద్యామండలికి చెందిన కృష్ణమూర్తి ఉన్నారు.

చిత్రం.. విద్యార్థులతో మాట్లాడుతున్న వర్సిటీ వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్