ఆంధ్రప్రదేశ్‌

కూష్మాండ దుర్గగా భ్రామరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 4: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభ్రమరాంబ దేవి అమ్మవారు కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లన్నస్వామి, అమ్మవారికి కైలాస వాహనసేవ నిర్వహించారు. ఉదయం, సాయంత్రం అమ్మవారు, స్వామికి ప్రత్యేక పూజలను అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి నవావర్ణ కుంకుమార్చనలు, సుహాసిని పూజ, కుమారి పూజలు, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం విశేషంగా జరిపారు. సాయంత్రం పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. శ్రీభ్రమరాంబదేవిని కూష్మాండ దుర్గ అలంకారంలో, శ్రీమల్లికార్జున స్వామి, అమ్మవారిని కైలాస వాహనంపై ఆశీనులను చేసి అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులకు ధూపదీప నైవేద్యాలతో మంగళహారతులు ఇచ్చి గర్భాలయం మీదుగా ఆలయ పురవీధుల్లోకి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొని వచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం ముందు జానపద కళారూపాలు, కళాకారుల విన్యాసాలు, డప్పువాయిద్యాలు, చిన్నారుల కోలాటాలు, మేళతాళాలు భక్తులను అలరించాయి. భక్తులు స్వామి అమ్మవార్లకు నారీకేళాలు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహక అధికారి నారాయణ భరత్ గుప్త దంపతులు, జెఇఓ హరినాథరెడ్డి దంపతులు, ఆలయ ఎఇఓలు, అధికారులు, అర్చక వేద పండితులు భక్తులు పాల్గొన్నారు.