ఆంధ్రప్రదేశ్‌

‘ప్లాట్‌ఫారం’ భారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), అక్టోబర్ 4: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాట్‌ఫారం టికెట్ ధరను 20 రూపాయలకు పెంచారు. శరన్నవరాత్రులకు ఇక్కడి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకోడానికి వచ్చే భక్తులకు వీడ్కోలు పలకడానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఈ రద్దీని నివారించడానికి అధికారులు ఒక్కసారిపై దుర్గమ్మ భక్తులపై ‘ప్లాట్‌ఫారం భారం’ రెట్టింపు చేశారు. ఈ టికెట్ ధర పెంపుదల ఈ నెల 11వరకు మాత్రమేనని, 12నుండి యథాతథంగా రూ.10 అమలులోకి రైల్వే అధికారులు తెలిపారు. జనం రద్దీని నివారించడానికి ప్రజలపై భారం మోపడం ఇదే మొదటిసారి. కాగా, ప్లాట్‌ఫారం టిక్కెట్ ధర పెంచడం ద్వారా రద్దీని నివారించొచ్చనుకున్న రైల్వే అధికారుల ఎత్తుకు ప్రజలు పైఎత్తు వేస్తున్నట్టు కనిపిస్తోంది. నగర సమీపంలో ఉన్న స్టేషన్లకు పాసింజర్ రైలుకు టిక్కెట్ తీసుకుంటే 5 రూపాయలతో సరిపోతుంది. అంటే అదనంగా పది రూపాయలు రాబట్టాలనుకున్న రైల్వే అధికారుల ఆలోచనలు చిత్తు చేస్తూ అసలులోనే ఐదు రూపాయలు కొర్రీ పెడుతున్నట్టు తెలిసింది.