ఆంధ్రప్రదేశ్‌

ఒకరి ప్రాణం ఐదుగురికి జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, అక్టోబర్ 4: అతను మూడు పదులు దాటిన యువకుడు... రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన బాధితుడు... అతను బతకడం దుర్లభమని తెలిసినా... అంతటి దుఃఖంలోనూ అతని కుటుంబ సభ్యులు మానవత్వానికే పెద్దపీట వేశారు. మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి సాక్షీభూతంగా నిలిచారు. అతని ఐదు కీలక అవయవాలు ఐదు ప్రాంతాలకు వెళ్లి మరో ఐదు కుటుంబాలకు జీవం పోశాయి. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన పి సుబ్బారెడ్డి (35) అనే యువకుడు ఇందుకూరుపేట గ్రామంలో ఓ బ్రాందీ షాపులో పనిచేస్తున్నాడు. ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళుతూ వాహనం అదుపు తప్పి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మెదడు అచేతనావస్థకు చేరిందని డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు నారాయణ ఆసుపత్రి డాక్టర్లతో సంప్రదించి సుబ్బారెడ్డి అవయవాలను దానం చేయడానికి మంగళవారం ముందుకొచ్చారు. అందులో భాగంగా సుబ్బారెడ్డి గుండెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కృష్ణపట్నం పోర్టు సమకూర్చిన హెలికాప్టర్ ద్వారా తరలించారు. కాలేయాన్ని విజయవాడకు, ఒక కిడ్నీ తిరుపతికి, మరో కిడ్నీ నారాయణ వైద్యశాలకు, ఊపిరితిత్తులు చెన్నైకు, నేత్రాలను నెల్లూరులోని మోడరన్ ఐ ఆసుపత్రి సకాలంలో తరలించినట్లు నారాయణ వైద్య సిబ్బంది తెలిపారు. నారాయణ మెడికల్ కాలేజీ ఆవరణలో ల్యాండ్ అయిన హెలికాప్టర్ ద్వారా గుండెను తరలించారు. మిగతా అవయవాల తరలింపు కోసం ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అంబులెన్స్‌లో మిగతా అవయవాలను తరలించారు. సుబ్బారెడ్డికి కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా,
నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలోనే ఇటీవలి కాలంలో నలుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు రావడం దీనిపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని పలువురు వైద్యులు తెలిపారు. తను చనిపోతూ అతనికి తెలియకుండానే కొన్ని కుటుంబాలకు సహాయపడటం అనేది గొప్ప విషయం అని పలువురు పేర్కొన్నారు.

గుంటూరులో గుండెమార్పిడి చికిత్స
రాష్ట్రంలోనే తొలిసారిగా

ప్రభుత్వాసుపత్రిలో గుండెమార్పిడి శస్తచ్రికిత్స నిర్వహించి చరిత్ర సృష్టించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల మరోమారు గుండె మార్పిడికి వేదికైంది. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను హెలికాప్టర్ ద్వారా తీసుకువచ్చి జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న మహిళకు అమర్చారు. ప్రకాశం జిల్లాలో బ్రెయిన్‌డెడ్ అయిన సుబ్బారెడ్డి గుండెను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నూలుకు చెందిన హీరామున్‌బాయి అనే మహిళకు అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. కృష్ణపట్నం నుంచి గుంటూరు పోలీసు పెరెడ్‌గ్రౌండ్‌లో దిగిన హెలికాప్టర్ నుంచి సుబ్బారెడ్డి గుండెను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య క్షణాల్లో జిజిహెచ్‌కు చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రముఖ గుండె శస్తచ్రికిత్స వైద్యనిపుణులు గోపాలకృష్ణ గోఖలే బృందం శస్తచ్రికిత్స జరిపింది. సహృదయ ట్రస్ట్, జిజిహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో గుండెమార్పిడి శస్తచ్రికిత్సను చేపట్టారు.

చిత్రం... హెలికాప్టర్‌లో గుంటూరుకు చేరిన గుండె