తెలంగాణ

రెవెన్యూ గ్రామాల సంఖ్య పెంచుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ గ్రామాల సంఖ్యను పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తొలుత జిల్లాల పునర్వ్యస్థీకరణ ఒక కొలిక్కి వచ్చి, అవి ప్రారంభం అయిన తర్వాత పరిపాలనాపరంగా కిందిస్థాయిలో చేపట్టాల్సిన సంస్కరణలకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 42 రెవెన్యూ డివిజన్లు, 459 రెవెన్యూ మండలాలు, 10,434 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల సంఖ్య పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా తెలుసుకునేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడంలో మరింత సమర్థత కనబరిచేందుకు రెవెన్యూ గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండాలని భావిస్తున్నారు.
రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) కీలకమైన అధికారిగా ఉంటారు. గత నెల రోజుల నుండి ఈ పోస్టు ఖాళీగా ఉంది. సిసిఎల్‌ఎగా పనిచేస్తూ నెల రోజుల క్రితం పదవీ విరమణ చేసిన రేమండ్ పీటర్ తర్వాత ఈ పోస్టులో ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సిసిఎల్‌ఎగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రాజీవ్ శర్మకు సాధారణ పరిపాలనా వ్యవహారాల్లోనే తీరిక లేకుండా ఉన్నారు. దాంతో కీలకమైన రెవెన్యూ శాఖలో సంస్కరణలను తీసుకువచ్చేందుకు సమయం సరిపోవడం లేదు. దాంతో రెవెన్యూ శాఖలో పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సాంకేతికంగా సమస్యలు తలెత్తుతున్నాయి.
రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలు కాకుండా మరో 9834 నివాస గ్రామాలున్నాయి. నివాసం లేని గ్రామాలు కూడా మరో 600 వరకు ఉన్నాయి. వీటిలో చిన్న గ్రామాలు, తండాలు కూడా కలిసి ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల సంఖ్యను పెంచితే ఏ విధంగా ఎన్ని పెంచవచ్చో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి పెద్ద ప్రహసనం అవసరం అవుతుంది. జిల్లాకలెక్టర్లు, ఆర్‌డిఓలు, తహశీల్దారులు, గ్రామ రెవెన్యూ అధికారులు అంతా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావలి ఉంటుంది. ప్రజాభిప్రాయం కూడా సేకరించి అన్ని కోణాల్లో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కొత్తగా జిల్లాలు ఏర్పాటయ్యాక జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను తీసుకుని రెవెన్యూ గ్రామాల పునర్వ్యవస్థీకరణ చేయాలని భావిస్తున్నారు. జిల్లాల ఏర్పాటు తర్వాత రెవెన్యూ గ్రామాల సంఖ్యను పెంచడం విషయంలో ప్రతిపాదనలను నెమ్మదిగా పరిశీలిస్తారని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో మంగళవారం చెప్పారు. ఇందుకోసం చాలా సమయం అవసరం అవుతుందని ఆయన వెల్లడించారు.