ఆంధ్రప్రదేశ్‌

గీతం వర్శిటీలో ప్లేస్‌మెంట్స్ మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రాంగణ నియామకాల్లో అత్యధికంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంపికయ్యారని వర్శిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐటి కోర్ సెక్టార్‌కు చెందిన బడా కార్పొరేట్లు బహుళ జాతి సంస్థలు గీతం ప్రాంగణ నియామకాలు నిర్వహించి, ఏడో సెమిస్టర్ కంటే ముందే సెప్టెంబర్ నాటికే 473 మంది ఎంపికయ్యారు. ఐటి దిగ్గజాలు టెక్ మహేంద్ర, సిజీఐ, ఎన్‌టిటి డేటా తదితర సంస్థలు రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించాయి. ఊనిక్ సంస్థ ఇద్దరు విద్యార్థులకు 12 లక్షల ప్యాకేజీ ఇవ్వగా, వీఎంవేర్ 9.52 లక్షలు ప్యాకేజీ నలుగురు విద్యార్థులకు ఇచ్చింది. ప్రోకర్మా 8.30 లక్షల వేతనం ఆఫర్ చేసింది. వేరిజోన్ 5.20 లక్షలు 10 మందికి, రాక్‌వెల్ కొలిన్స్ 4.25 లక్షలు 11 మందికి, పోర్టువేర్ 4 లక్షల ఆఫర్ ముగ్గురికి ఆఫర్ చేశాయి. వర్చూషా పాలారిస్ 22 మందిని, టెక్ మహేంద్ర 250 మందిని, సిజిఐ 70 మందిని, క్యాప్ జెమిని 42 మందిని, ఎటి అండ్ టి ఇద్దరిని, ఎన్‌టిటి డేటా 57 మందిని రిక్రూట్ చేసుకున్నాయి.
కొనసాగుతున్న
ఉపరితల ఆవర్తనం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 5: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం కూడా కొనసాగుతోంది. ఇది సముద్ర ఉపరితలం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని విశాఖలోని తుపాను హెచ్చిరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కురిసే అవకాశం ఉందని తెలిపారు.