రాష్ట్రీయం

సింహ వాహనంపై మలయప్ప స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 5: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన బుధవారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై అధిరోహించి భక్తులకు అభయమిచ్చారు. దుష్టశిక్షణ కోసం నారసింహునిగా మలయప్ప భక్తులను అనుగ్రహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల చెక్క్భజనలు, పండరి భజనలు, చండిమేళం, కోలాటాలు, జీయ్యంగార్ల వేద గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
సింహం పరాక్రమానికి , ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతులవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈసింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.
ముత్యపు పందిరిపై ముగ్ద మనోహరుడు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం తిరుమలలో బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామి తన దేవేరులతో కాళీయ మర్దని అలంకారభూతుడై ముత్యపు పందిరి వాహనంలో ఊరేగుతూ భక్తులకు కన్నుల పండగ చేశారు. ఈకార్యక్రమంలో టిటిడి ఇఓ సాంబశివరావు, చైర్మన్ చదలవాడ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల మాడవీధుల్లో బుధవారం ఉదయం సింహ వాహనంపై,
రాత్రి ముత్యపు పందిరి వాహనంపై అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తున్న మలయప్పస్వామి