ఆంధ్రప్రదేశ్‌

స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 5: శ్రీశైలం శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు శేషవాహన సేవ నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శ్రీచక్రనవవర్ణ పూజలు, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగం, జపాలు, పారాయణాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం జపానుష్టానాలు, నవావర్ణ కుంకుమార్చన, చండీహోమం, రుద్రహోమం, రాత్రి సుహాసిని పూజ, కాళరాత్రి పూజ అమ్మవారికి విశేషంగా జరిపించారు. నవదుర్గ రూపాల్లో ఐదో రూపమైన స్కందమాత అలంకారం చేశారు. దేవి చతుర్భుజాలతో స్కందుడు అనగా కుమారస్వామిని ఎత్తుకుని దర్శనమిస్తోంది. స్కందుడు శక్తిదరుడు, దేవసేనల అధిపతి, నెమలి వాహనుడు కాబట్టి ఆయన తల్లి పార్వతీదేవికి స్కందమాత అని పేరు వచ్చింది. తల్లి నాలుగు చేతులలో స్కందుడిని పట్టుకుని పద్మం ధరించి ఎడమ చేతిలో అభయముద్ర, కమలాన్ని ధరించి ఉంటుంది. కమలవాహిని శే్వతవర్ణం కలిగి ఉంటుంది. సింహం అమ్మవారి వాహనం. స్కందమాతను ఉపాసిస్తే విశుద్ధ చక్రంలో మనస్సు స్థిరమవుతుంది. భవసాగరాల నుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చు. అమ్మకు పెరుగన్నం ఇష్టం. ఈదేవిని ఆరాధించడం వల్ల అన్ని కోర్కెలు నెరవేరడమే కాకుండా శాంతిసౌఖ్యాలు లభిస్తాయి.
ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు రాత్రి శేషవాహనం సేవ నిర్వహించారు. శేషవాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులనుచేసి పూజలు జరిపారు. స్కందమాత, మల్లన్న, భ్రమరాంబికకు అర్చక వేదపండితులు ధూపదీప నైవేద్యాలతో మహామంగళహారతులు ఇచ్చి మేళతాళాల నడుమ మంగళవాయిద్యాలతో గ్రామోత్సవానికి తోడ్కొని వచ్చారు. డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నారాయణభరత్ గుప్త దంపతులు, జెఇఓ హరినాథరెడ్డి దంపతులు, ఎఇఓలు, అర్చక వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.