ఆంధ్రప్రదేశ్‌

కడప జిల్లాలో భారతి సిమెంట్‌కు పర్యావరణ అనుమతులపై నవంబర్ 15న బహిరంగ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: కడప జిల్లాలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై నవంబర్ 15వ తేదీన పర్యావరణ అనుమతుల గురించి పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అనుమతుల విషయమై భారతి సిమెంట్స్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ టి సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపి కాలుష్య నియంత్రణ మండలి, ఏపి ప్రభుత్వం మైనింగ్ లీజును ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏపి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ విషయంలో ఉద్దేశ్యపూర్వకంగానే బహిరంగ విచారణను వాయిదా వేస్తున్నారన్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రతిపక్షనేత కుటుంబానికి చెందినదైనందు వల్ల ఇలా జరుగుతోందన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది డి రమేష్ వాదనలు వినిపిస్తూ నవంబర్ 15న పబ్లిక్ హియరింగ్ ఉంటుందని తెలిపారు. అనంతరం ఈ కేసును నవంబర్ 18వ తేదీకి వాయిదా వేశారు.